విజయనగరం, ఆగస్టు 27: ఉద్యోగ అవకాశం వచ్చిన యువకులు రాణించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో గజపతినగరం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జాబ్ మేళా ఇంటర్వ్యూలలో ఎంపికైన విద్యార్థులకు గురువారం మంత్రి క్యాంప్ కార్యాలయం నందు నియామక పత్రాలు అందజేశారు.

తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం ప్రతిభకు తార్కాణం

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఉద్యోగం పొందటం కష్టంగా ఉందని, తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం మీ అదృష్టంతో పాటు, మీ ప్రతిభకు తార్కాణమన్నారు. నేటి చిన్న ఉద్యోగమే భవిష్యత్తులో అనుభవం నేర్పుతుందని, పెద్ద ఉద్యోగానికి ఈ చిన్న ఉద్యోగ అనుభవం పనిచేస్తుందని, ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే అర్హత సాధిస్తారనే విషయాన్ని యువత తెలుసుకోవాలన్నారు.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమల స్థాపన: మంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం పరిశ్రమలు స్థాపన చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. సెంచూరియన్ యూనివర్సిటీ వారు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

27 మందికి నియామక పత్రాలు, జీతంతో పాటు వసతి సౌకర్యం

ఈ కార్యక్రమంలో 27 మందికి నియామక పత్రాలు అందజేశారు. వీరికి జీతంతో పాటు వసతి సౌకర్యం కూడా సెంచూరియన్ యూనివర్సిటీ వారు అందించటం శుభపరిణామం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.