విజయనగరం, సెప్టెంబర్ 19: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మూలన కోసం పౌష్టికాహారం ఎంతో అవసరమని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

పోషణ మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు బుడతనపల్లి సెక్టారు పరిధిలో ఉన్న గోడియడా గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు శనివారం పోషణ మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం, ఆరు నెలలు దాటిన పిల్లలకు అన్నప్రాసన, సంవత్సరం న్నర వయస్సు దాటిన పిల్లలకు ఆరోగ్య బాలల పోటీ (వెల్ బేబీ షో) నిర్వహించడం జరిగింది. మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ

గర్భిణీలకు సీమంతం వేడుక ప్రత్యేకత.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం

సీమంతం (శ్రీమంతం) అనేది గర్భిణీ స్త్రీకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ఆశీర్వాదాలు అందించే ముఖ్యమైన సంప్రదాయ వేడుకన్నారు. గర్భధారణ సమయంలో తల్లి సంతోషంగా, ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆమెకు అవసరమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్నాయి అన్నారు.

సీమంతం వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి గర్భిణీని ఆశీర్వదించడం ద్వారా ఆమెకు మానసిక ఆనందం, ధైర్యం కలుగుతుందని సంప్రదాయంగా నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషంగా ఉండేందుకు కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయత దోహదపడతాయన్నారు.

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించబడుతుందని ఇది లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆరు నెలలు నిండిన వెంటనే అన్నప్రాసన్న చేయడం వలన పిల్లలు పౌష్టికాహారం తిని ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. అదేవిధంగా సంవత్సరం వయసుకి టీకాలన్ని పూర్తిచేసుకుని వయసుకు తగ్గ బరువు ఎత్తుతో ఆరోగ్యంగా ఉన్న బాలలకు ప్రోత్సహించడం వెల్ బేబీషో కుటుంబంలో ఉత్సాహం కలిగించే సందర్భాలని మంత్రి తెలిపారు.

సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవాలు జరుగుతాయన్నారు.

ఈ సందర్భంగా రాగి పిండి, మునగాకు, బాలామృతం ఉపయోగించి వంటకాలను తయారుచేసి పోషకాహార ప్రదర్శనను ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు.

గర్భిణీ స్త్రీల శ్రీమంతం వేడుకల్లో పాల్గొని పసుపు కుంకాలు చీర గాజులు పండ్లు అందించారు.

ఏడు సంవత్సరాలు దాటిన పిల్లలకు అన్నప్రాసన్న కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ చేతుల మీదుగా చేశారు. అంగన్వాడి చిన్నారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.