విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రదేశీక్ మార్వారీ సమ్మేళన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖపట్నం మార్వారీ సమ్మేళన్ అధ్యక్షులు పోడేశ్వర్ పురోహిత్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ సమీపంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

  • జగదాంబ జంక్షన్ సమీపంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం
  • నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశీక్ మార్వారీ సమ్మేళన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ మార్వారీ సమ్మేళన్ అధ్యక్షులు పోడేశ్వర్ పురోహిత్
  • పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఆయన పిలుపు
  • కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు డాక్టర్. ఎం. ఆర్. ఎన్. వర్మ, విశాఖ మార్వారీ సమ్మేళన్ సభ్యులు

ఈ సందర్భంగా పోడేశ్వర్ పురోహిత్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి ప్రకృతిని కాపాడదామని పిలుపునిచ్చారు. పార్వతీదేవి పసుపుతో సృష్టించిన గణనాధుని స్ఫూర్తితో మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు డాక్టర్. ఎం. ఆర్. ఎన్. వర్మ మాట్లాడుతూ ప్రకృతిని ఆర్తితో కాపాడుకుందామని, వినాయక చవితి పేరుతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో వివిధ రంగుల రసాయనాలతో సాగుతున్న వ్యాపార ధోరణికి స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు. మట్టి గణపతులను పూజించడం ద్వారా నదులను, చెరువులను స్వచ్ఛంగా ఉంచడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రసాయన రంగులతో కూడిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల నీటిలోని జీవరాసులకు హాని కలగడంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. స్వచ్ఛమైన ప్రకృతిని భావితరాలకు అంకితం చేద్దామని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో విశాఖ మార్వారీ సమ్మేళన్ సభ్యులు పాల్గొన్నారు.