రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర యన్.జి.జి.ఓ.ల సంఘం చేస్తున్న కృషిని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అభినందించింది.
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెంచేందుకు వేతన సంఘం (పి.అర్.సి. కమిషన్), పెండింగ్లో ఉన్న రెండు కరువు భత్యాల చెల్లింపు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా కృషి చేయడం, ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచేలా కృషి చేయడం వంటి చర్యలు ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తాయని సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
