వెంకటగిరి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. కోర్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

  • తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం
  • ఎన్నికలకు సంబంధించి కోర్టులో పలు అంశాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడి
  • కొన్ని అంశాలపై జడ్జిమెంట్ రిజర్వ్‌లో ఉందని, మరికొన్నింటిపై వాదనలు జరుగుతున్నాయని వివరణ
  • కోర్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటన

తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో మంత్రి నారాయణ మున్సిపల్ ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో పలు అంశాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.

కొన్నింటిపై జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఉందని, మరికొన్ని అంశాలపై ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.