లఖ్నవూ, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖాదీ ఉత్పత్తులపై రాయితీ కానుక ప్రకటించారు. ఖాదీ వస్త్రాలపై 2027 జనవరి 30 వరకు 25 శాతం రాయితీ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఖాదీ భారత స్వాతంత్ర్య మంత్రమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. (యూఎన్ఐ)