లక్నో, అక్టోబర్ 24 (ఎక్స్‌ప్రెస్ టుడే): డీప్‌ఫేక్‌లు, సైబర్ మోసాలు, గుర్తింపు దొంగతనం వంటి సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు, డిజిటల్ సాక్ష్యాల విశ్వసనీయతను కాపాడేందుకు సమష్టి కృషి అవసరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం పిలుపునిచ్చారు. లక్నోలో ‘టెక్ సంగం’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించి ఆయన ప్రసంగించారు.
‘డేటా కొత్త చమురు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఒకసారి అన్న మాటలను గుర్తుచేసిన సీఎం, ఉత్తరప్రదేశ్ ఏఐ, డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. 2030 నాటికి ఐదు గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని రాష్ట్రం నిర్దేశించుకుందని, ఇందుకోసం ఐదు ప్రధాన డేటా సెంటర్ క్లస్టర్ల ఏర్పాటుపై పనిచేస్తోందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్‌లో అక్టోబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ‘ఇంటర్నేషనల్ డైలాగ్–26’ జరుగుతోంది. సైబర్ నేరాలు, కృత్రిమ మేధ సామర్థ్యాలు, క్వాంటమ్ సాంకేతికత భవిష్యత్తుపై భారత్, విదేశాల నుంచి నిపుణులు ఇందులో చర్చిస్తున్నారు.
