ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆహ్వానించింది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకిదేవీ, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

  • సీఎం చంద్రబాబును కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు
  • బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకిదేవీ, ఈవో ముద్దాడ రవిచంద్ర సమక్షంలో ఆహ్వానం
  • సీఎంకు వేదాశీర్వచనం అందించిన టీటీడీ వేద పండితులు
  • బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో చర్చించిన సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు చర్చించారు.