తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడులు ఆకర్షించేందుకు తలపెట్టిన తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం రాజకీయ కారణాలతోనే తనకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు.
గుజరాత్ సీఎంకు విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చిన కేంద్రం, తనను ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. హైదరాబాద్ వచ్చాక ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
కేంద్రం తనను అడ్డుకున్నా, తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని అడ్డుకోలేదని, పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
