తెలంగాణ రైజింగ్‌ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు బలమైన మద్దతుదారులుగా, రాయబారులుగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు వారు భాగస్వాములు కావాలని కోరారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల ఆకర్షణలో ప్రవాస తెలంగాణీయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వారి అనుభవం, నెట్‌వర్క్‌ను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుంటామని తెలిపారు.

వచ్చే దశాబ్దంలో తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.