రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ నిర్వహించిన 'మూడ్ ఆఫ్ తెలంగాణ' సర్వేలో సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై 74 శాతం మంది సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని అభిప్రాయపడగా, కేసీఆర్ పాలనే బాగుందని 72.82 శాతం మంది కితాబిచ్చారు.
- రేవంత్ పాలన బాగాలేదని 74 శాతం మంది అభిప్రాయం
- కేసీఆర్ పాలనే బాగుందని 72.82 శాతం మంది కితాబు
- వెయ్యి రోజుల పాలనపై 76 శాతం మంది అసంతృప్తి
- 118 నియోజకవర్గాల వారీగా సర్వే వివరాల విశ్లేషణ
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, హామీల అమలులో వైఫల్యం, రాజకీయ విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి సర్వేలో ప్రతిబింబించింది. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపైనూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సర్వే పేర్కొంది.
118 నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో కేసీఆర్ నివాసంపై దాడి యత్నం అంశంపైనా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైనట్లు తేలింది. ఈ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
