మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదంపై పీసీసీ నివేదికను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి కుమార్తె వ్యాఖ్యలపై ఇచ్చిన వివరణ, క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీ సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

ఈ వ్యవహారంపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు.