హైదరాబాద్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లంగర్హౌజ్లోని బాపూ ఘాట్లో గాంధీకి పుష్పాంజలి ఘటించి, అక్కడ బాపూ ఘాట్ డిజిటల్ మ్యూజియాన్ని ప్రారంభించారు.
మ్యూజియంలో గాంధీ జీవితం, సందేశాన్ని వివరించే చిత్రాన్ని వారు వీక్షించారు. అనంతరం గవర్నర్ పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంచే వీడియోను ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (యూఎన్ఐ, ఏఎన్ఐ)