హైదరాబాద్, అక్టోబర్ 2: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అన్ని సెంట్రల్ కిచెన్లను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
నవంబర్ 30 నాటికి నిర్మాణం సహా ఇతర పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, క్రమం తప్పని పర్యవేక్షణ కోసం కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని, విద్యార్థులు వాటిని సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. (యూఎన్ఐ)