హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. సభ ఉదయం 10 గంటలకు జీరో అవర్‌తో ప్రారంభమైంది.
జీరో అవర్ అనంతరం 'ఎల్‌నినో ప్రభావం – నివారణ చర్యలు' అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవన వర్షపాతం జాతీయ స్థాయిలో దీర్ఘకాల సగటు కన్నా 15 శాతం తక్కువగా నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
