తమిళనాడులో టీవీకే సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాతో ఖాళీ అయిన ధారాపురం, మదురై అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
గత ఎన్నికల్లో మదురైలో టీవీకే రెండో స్థానంలో, ధారాపురంలో డీఎంకే రెండో స్థానంలో నిలిచాయి. దీంతో ఈ రెండు స్థానాల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి తూర్పు స్థానంతో సహా మరో ఐదు స్థానాలకు ఇంకా ఉప ఎన్నికల ప్రకటన వెలువడలేదు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని మొత్తం ఐదు స్థానాలకు ఈ దఫా ఉప ఎన్నికలు జరగనున్నాయి.
