తిరుమల, సెప్టెంబర్ 20: రామభక్త హనుమంతునిపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ వాహనసేవలో స్వామివారి దివ్య మంగళ రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
పూలమాలలతో అలంకరించిన హనుమంత వాహనంపై ఊరేగిన మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధుల్లో తరలివచ్చారు. అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పూజలు, హారతులు నిర్వహించారు.
