తెలంగాణలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది.
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్నగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షాలు మరింత విస్తరించే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది.
వర్షాకాలం చివరి దశలో ఈ తేమ ప్రభావంతో పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
