తమిళనాడు శాసనసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్, రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించారు. డీలక్స్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో ఎలాంటి ఆదాయ పరిమితి, ప్రయాణాల సంఖ్యపై ఆంక్షలు లేకుండా మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.

'అన్నపూర్ణి సూపర్ 6' పథకంలో భాగంగా వచ్చే పొంగల్ పండుగ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు, ఇందుకోసం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా సుమారు రూ.4,000 జమ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.

పరండూరులో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసే ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రకటించిన విజయ్, బదులుగా చెన్నై విమానాశ్రయాన్నే విస్తరించనున్నట్లు, కొత్త విమానాశ్రయానికి స్థలాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు.