చెన్నై, అక్టోబర్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 11న తమిళనాడులో ఒక రోజు పర్యటన చేసి, చెన్నైలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ నుంచి చెన్నై చేరుకుని చెన్నై మెట్రో రెండో దశను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణిస్తారు. అలాగే ఐఐటీ మద్రాస్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, ఇళయరాజా సంగీత కేంద్రాన్ని ప్రారంభిస్తారని యూఎన్ఐ తెలిపింది.