చెన్నై, అక్టోబర్ 2: అక్టోబర్ 6న జరగనున్న మదురాంతకం (రిజర్వుడ్) నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ రెండో, చివరి విడత ప్రచారంలో భాగంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు.

రోడ్డు పక్కన దుకాణాల్లో టీ తాగుతూ, ఇంటింటికీ వెళ్తూ, పొలాల్లో ట్రాక్టర్‌తో దున్నుతూ, మహిళలు, దివ్యాంగులతో మాట్లాడుతూ ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అంతకుముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విస్తరణను ప్రారంభించారు. (యూఎన్ఐ)