చెన్నై, సెప్టెంబర్ 30: తమిళనాడులోని 11 జిల్లాలు, కారైక్కాల్‌లో బుధవారం కొన్ని చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినట్లు ఐఏఎన్ఎస్ పేర్కొంది.
ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తున వాతావరణ ఆవర్తనం ఉందని శాఖ వివరించింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా మన్నార్ సింధుశాఖ వరకు సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి విస్తరించి ఉంది.
అండమాన్ సముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడనం సెప్టెంబర్ 28న ఉత్తర–వాయవ్య దిశగా కదిలి మయన్మార్ తీరాన్ని దాటింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కొన్ని చోట్లకే పరిమితమై, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.