ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1కు 30 మీటర్ల దూరంలో కొత్త ప్లాజా, క్యాబ్ పికప్ పాయింట్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు.
- టెర్మినల్-1కు 30 మీటర్ల దూరంలో కొత్త ప్లాజా, క్యాబ్ పికప్ పాయింట్ ఏర్పాటు
- కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వర్చువల్ ప్రారంభోత్సవం
- ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించే లక్ష్యం
కొత్త ప్లాజా ఏర్పాటుతో ప్రయాణికులు టెర్మినల్‌కు మరింత సమీపంలోనే క్యాబ్‌లు ఎక్కే వెసులుబాటు లభిస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల రద్దీ సమయాల్లో ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గనుందని పేర్కొన్నారు.
చెన్నై విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు విమానాశ్రయ అధికారులు వివరించారు.
