'పరాశక్తి' సినిమాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగమ్మాయి శ్రీలీల ఇటీవల ఇచ్చిన ఒక తమిళ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'నేను డాక్టర్ని కావాలనుకున్నాను, కానీ యాక్టర్ని అయ్యాను. ఈ రెండూ నాకు గర్వకారణమే' అని ఆమె పేర్కొన్నారు. జీవితంలో జయాపజయాలు సహజమని, అపజయం ఎదురైనప్పుడు కాసేపు బాధపడి తర్వాత మళ్ళీ ముందుకు సాగిపోతానని చెప్పారు.
ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తున్న శ్రీలీల, తనను కొందరు 'లేడీ సూపర్ స్టార్' అని పిలుస్తున్నా దానికి తాను ఒప్పుకోనని, అది కేవలం నయనతార మాత్రమేనని స్పష్టం చేశారు.
