రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి రజత పతకం సాధించిన ఎచ్చెర్ల ఆర్‌జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ అభినందించారు.

ఆగస్టు 27న నిర్వహించిన మహిళల అండర్-23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన ఆరుగురు విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్యభూమిక వహించారు.

రన్నరప్ ట్రోఫీ, నగదు బహుమతి

ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు రూ.50,000 నగదు బహుమతిని అందుకున్నారు.

విజేతలను అభినందించిన కళాశాల యాజమాన్యం

సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విజేతలతో పాటు సహకరించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రతినిధులు టి.దిలీప్ కుమార్, కృష్ణంరాజులను డైరెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, అకడమిక్ డీన్ శివరామశాస్త్రి, వెల్ఫేర్ డీన్లు డాక్టర్ ప్రకాష్ రావు, డాక్టర్ యోగేశ్వరి పాల్గొన్నారు.