హైదరాబాద్‌లో జరగనున్న ఖేలో ఇండియా గేమ్స్ ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వేదికల వద్ద అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

క్రీడా వేదికల తనిఖీలు, మరమ్మతు చర్యలు, విస్తృత భాగస్వామ్యంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.