జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార పనులకు శ్రీకారం; 13 శిలాఫలకాల ఆవిష్కరణ
ప్రొద్దుటూరు, అక్టోబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. రూ.30,156 కోట్లతో ప్రొద్దుటూరు నుంచి జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార పనులను వారు ప్రారంభించారు.
దీనికి సంబంధించి కొత్తపల్లి గ్రామంలో పైలాన్ ఆవిష్కరించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు తాగునీరు అందించే పనులకు సంబంధించి 13 శిలాఫలకాలను ఆవిష్కరించారు.
అనంతరం బహిరంగ సభలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
