ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా గురువారం ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అదే రోజు విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.
ప్రధాని మోదీ గుజరాత్లోని వాద్నగర్ నుంచి దేశ అత్యున్నత పదవి వరకు సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో హైవేలు, రైల్వేల ఆధునీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభంతో దేశ రవాణాముఖచిత్రమే మారిపోయిందని పేర్కొన్నారు.
మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
