హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రతిపాదిత 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు అత్యవసరంగా అనుమతి కోరుతూ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
శాంతిభద్రతల సమస్యలను ఉదహరిస్తూ సైబరాబాద్ పోలీసులు గతంలో ఈ సభకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై అత్యవసర విచారణ కోరుతూ జనసేన కోర్టును ఆశ్రయించింది.
అయితే పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, తక్షణ ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో సభ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. తదుపరి కార్యాచరణపై పార్టీ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి.
