నిడదవోలు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18519/18520) రైలుకు ప్రయోగాత్మక హాల్ట్ (ఆగుదల) కల్పిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాంత ప్రజల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని, విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18519/18520) రైలుకు నిడదవోలు రైల్వే స్టేషన్‌లో రాబోయే ఆరు (06) నెలల పాటు ప్రయోగాత్మక ప్రాతిపదికన హాల్ట్ కల్పించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
ఈ రైలు హాల్ట్‌ల అమలు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 18519), 05.09.2026 నుండి నిడదవోలు రైల్వే స్టేషన్‌లో 02:54 గంటలకు ఆగి, 02:55 గంటలకు బయలుదేరుతుంది.
అలాగే తిరుగు ప్రయాణంలో, లోకమాన్య తిలక్ టెర్మినస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 18520), 05.09.2026 నుండి నిడదవోలు రైల్వే స్టేషన్‌లో 06:09 గంటలకు ఆగి, 06:10 గంటలకు బయలుదేరుతుంది.
ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా ప్రయాణ ప్రణాళికలు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
