నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా కఠ్మాండులో చిక్కుకుపోయిన మహారాష్ట్రకు చెందిన 106 మంది పర్యాటకులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తరలించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తక్షణం రంగంలోకి దిగారు.
సీఎం ఆదేశాల మేరకు కఠ్మాండు నుంచి జనక్‌పూర్ వరకు ప్రయాణానికి నాలుగు మినీ బస్సులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భారత్-నేపాల్ సరిహద్దు మీదుగా బిహార్‌లోని దానాపూర్‌కు, ఆ తర్వాత రైలు మార్గంలో మహారాష్ట్రకు వారిని తీసుకురానున్నారు.
ఆగస్టు 28న బిహార్‌లోని దానాపూర్ నుంచి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ ద్వారా వీరు మహారాష్ట్ర చేరుకోనున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా రాష్ట్రానికి చేరే వరకు తానే స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తానని సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
