న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: మొమొరీ ధరల కారణంగా దేశీయంగా మొబైల్ ఫోన్ ధరలు సగటున 16 శాతం మేర పెరిగాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మొబైల్ ఫోన్ తయారీలో కీలకమైన వీటి దిగుమతులపై రూపాయి పతనం కూడా మరింత ప్రభావం చూపిందని పేర్కొంది.

చైనాకు చెందిన వన్‌ప్లస్ మాత్రమే పెద్దగా ధరలు పెంచలేదని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదిక వెలువరించింది.

"2026 తొలి అర్ధభాగంలో దేశంలో స్మార్ట్‌ఫోన్ ధరలు సగటున 16 శాతం పెరిగాయి. వన్‌ప్లస్ మాత్రం 8 శాతమే పెంచింది. మొమొరీ ధరల కారణంగా స్మార్ట్‌ఫోన్ విక్రయాల సగటు రెండో త్రైమాసికంలో ధర రూ.30వేలకు (318 డాలర్లు) చేరింది" అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.