న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): వికసిత్ భారత్ లక్ష్యాల కోసం బ్యాంకింగ్ రంగంపై సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి కేంద్ర మాజీ విజిలెన్స్ కమిషనర్ సురేశ్ ఎన్. పటేల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము, ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ పద్మజా చుండూరు, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్. విశ్వనాథన్ సభ్యులుగా ఉంటారు. బ్యాంకింగ్ విభాగం జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

కమిటీ ఆరు నెలల్లో తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది.