ఒమన్ తీరానికి సమీపంలో పనామా జెండాతో ఉన్న వాణిజ్య నౌక ‘ఎంటీ ఆన్ పీస్’పై జరిగిన దాడిలో 12 మంది సిబ్బంది గాయపడ్డారని, వారిలో 11 మంది భారతీయులని భారత విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది.

నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. ఒమన్ అధికారుల సహకారంతో గాయపడినవారిని సురక్షితంగా తరలించి, ఖసాబ్ (ఒమన్)లో చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ ‘ఎక్స్’లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇరాన్ యుద్ధం ఎనిమిదో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి పరిసరాల్లో వాణిజ్య నౌకలపై ఇరాన్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడికి ఎవరు బాధ్యులన్నది ప్రకటనలో లేదు.