రాంచీ నుంచి పట్నా మీదుగా లఖ్‌నవూ వస్తున్న ఇండిగో విమానం బుధవారం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. మార్గమధ్యంలో పిడుగు పడటంతో విమానం ముందు భాగం (నోజ్) దెబ్బతింది.

లఖ్‌నవూ విమానాశ్రయంలో ల్యాండింగ్ అనంతరం విమానాన్ని తనిఖీ చేయగా నోజ్ భాగం దెబ్బతిన్నట్లు గుర్తించారు. విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు; అందరూ సురక్షితంగా ఉన్నారు.

ఈ విమానం లఖ్‌నవూ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపారు.