న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (ఎక్స్ప్రెస్ టుడే): గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను అధికారుల అరెస్టు అధికారాలను తొలగించాలని నిర్ణయించినట్టు వార్తా సంస్థలు తెలిపాయి.
ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఉన్న పరిమితిని రూ.5 కోట్లకు పెంచినట్టు, షోకాజ్ నోటీసుల జారీకి రూ.10 వేల కనీస పరిమితిని నిర్ణయించినట్టు కథనాలు పేర్కొన్నాయి. అరెస్టులకు బదులు పన్ను వసూలు, వడ్డీ, జరిమానాల ద్వారా వివాదాలను పరిష్కరించే విధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రీఫండ్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేసి, వ్యాజ్యాలను తగ్గించే సంస్కరణలను కూడా కౌన్సిల్ ప్రకటించింది. అరెస్టు, ప్రాసిక్యూషన్ అధికారాల్లో మార్పులకు చట్ట సవరణలు అవసరమవుతాయని కథనాలు పేర్కొన్నాయి.
ఈ తాజా జీఎస్టీ సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు.