న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (ఎక్స్‌ప్రెస్ టుడే): భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభాన్ని కొందరు ‘ఒలిగార్కులు’ అడ్డుకుంటున్నారని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు.

‘‘భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా?’’ అని ఆయన ప్రశ్నించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. స్టార్‌లింక్ అనుమతుల విషయంలో పక్షపాతం లేదని పేర్కొంటూ, ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఆ వ్యాఖ్యలను నిరాధారమని వ్యాఖ్యానించింది.

మస్క్ వ్యాఖ్యలపై భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ స్పందిస్తూ ‘వన్‌వెబ్ కూడా ఎదురుచూస్తోంది’ అన్నట్టు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.