ఢిల్లీలో నివసించే మహిళలు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ), క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఇకపై ‘పింక్ సహేలీ స్మార్ట్ కార్డు’ ద్వారా మాత్రమే పొందగలరు.

ఈ కార్డు ఉన్నవారికే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కార్డు పొందే విధానం, దరఖాస్తు వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.