ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గ్యానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా పార్టీ నేతలను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతోంది.
ఈ రోజును భారత ప్రజాస్వామ్యానికి ‘బ్లాక్ డే’గా కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయుల్లో విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్టీ తెలిపింది.
ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి 70 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను రాజధానికి పంపినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.
జంతర్‌మంతర్ సమీపంలో ఇండియా కూటమి నిరసన సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో మహిళా అధికారులు, కానిస్టేబుళ్లతో సహా పోలీసు సిబ్బందిపై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన పలు వీడియోలను పరిశీలిస్తున్నారు; ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ఈ ఆందోళనల విషయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది.