భువనేశ్వర్, అక్టోబర్ 17 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఒడిశా కొత్త గవర్నర్‌గా నియమితులైన బ్రజ్ మోహన్ రామ్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భువనేశ్వర్ చేరుకున్నారు. ఆయన ఆదివారం (అక్టోబర్ 18) గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న ఒడిశాలో పర్యటించనున్నారు. భువనేశ్వర్, ఖుర్దా జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి, రాయ్‌రంగ్‌పూర్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని వార్తా కథనాలు తెలిపాయి.