కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన ప్రస్తుత చిత్రం షూటింగ్‌ను చివరి దశకు చేర్చిన హీరో నాగచైతన్య, తర్వాతి ప్రాజెక్టుపై కూడా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
'బెదురులంక 2012' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్లాక్స్ తర్వాతి సినిమాను నాగచైతన్యతో తెరకెక్కించే యోచనలో ఉన్నారని, ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
అదే సమయంలో, తొలి చిత్రం 'మసూద'తో మంచి విజయం సాధించిన దర్శకుడు సాయికిరణ్ కూడా ఇటీవల నాగచైతన్యను కలిసి ఒక హర్రర్ థ్రిల్లర్ కథను వినిపించినట్టు తెలిసింది. నిర్మాత ఏషియన్ సునీల్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టు, అంతా కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభం కావొచ్చని సినీ వర్గాల సమాచారం.
రెండు ప్రాజెక్టుల్లో దేనిని ముందుగా ఎంచుకుంటారన్నది ఇంకా అధికారికంగా ప్రకటన కావాల్సి ఉంది.
