రసాయన పరిశ్రమ రంగానికి ఊతమిచ్చేలా అక్టోబర్ చివరినాటికి ప్రత్యేక కెమికల్ సెక్టార్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో 2,500 నుంచి 5,000 ఎకరాల విస్తీర్ణంలో కెమికల్ పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
వేగవంతమైన అనుమతులు, వ్యాపార నిర్వహణ సౌలభ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, పరిశోధన-అభివృద్ధి, సాంకేతిక సంసిద్ధత, నూతన ఆవిష్కరణలకు తోడ్పాటుగా రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.
కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తూ, రసాయన రంగంలో తదుపరి భారీ పెట్టుబడులకు మహారాష్ట్రను పరిశీలించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పిలుపునిచ్చారు. వేగవంతమైన అనుమతులు, విధానపరమైన మద్దతును తాము అందిస్తామని హామీ ఇచ్చారు.
