కర్నూలు, సెప్టెంబర్ 03: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
- ఫారం-6, 7, 8 దరఖాస్తుల పెండెన్సీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం
- నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన
- యువ ఓటర్లు ఫారం-6 సమర్పించేలా అవగాహన కల్పించాలని ఆదేశం
- వారం రోజుల్లో మొత్తం పెండెన్సీ పరిష్కారానికి కర్నూలు కలెక్టర్ హామీ
గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియతో పాటు ఫారం-6 దరఖాస్తుల డిస్పోజల్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్హత కలిగిన యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఫారం-6 సమర్పించి ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఫారమ్–7, 8 దరఖాస్తుల పెండెన్సీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. అర్హత లేని వారిగా గుర్తించిన వారి వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వారికి ఫామ్-7 జనరేట్ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఫారమ్‌లు 6, 7 & 8 లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను, రాబోయే వారం రోజుల్లో మొత్తం పెండెన్సీని పరిష్కరిస్తామన్నారు. NVSP మరియు బుక్ ఏ కాల్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.
