మంగళగిరి, సెప్టెంబర్ 17: కర్నూలు నగరంలోని 18వ వార్డు మాజీ కార్పొరేటర్ పల్లవి తన అనుచరులతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యాను: పల్లవి
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పల్లవి మాట్లాడుతూ, కర్నూలు నగరంలో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని, కర్నూలు నగర అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.
పార్టీలో చేరిన నేతలు
పార్టీలో చేరిన వారిలో ప్రేమకాంత్, మురళి మోహన్, విజయ్ కుమార్, ప్రతాప్, బాబీ, మహాలక్ష్మి ఉన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గణేష్ సింగ్, బీజేపీ నాయకులు రాఘవేంద్ర, అవేజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
