విజయనగరం, ఆగస్టు 21: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కౌశలం కార్యక్రమం ద్వారా కియా మోటార్స్, అనంతపురం ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించిన మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు మొత్తం 215 మంది యువత హాజరుకాగా, 144 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా అనంతపురంలోని కియా మోటార్స్ సంస్థలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కియా మోటార్స్ హెచ్ఆర్ ప్రతినిధి ఆర్. పాపిరెడ్డి తెలిపారు.
