బెంగళూరు, అక్టోబర్ 9 (ఎక్స్‌ప్రెస్ టుడే): కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలో ఓట్లు చీలిపోతాయేమోనన్న ఆందోళన బీజేపీ, కాంగ్రెస్‌లలో నెలకొన్నట్టు డెక్కన్ హెరాల్డ్ కథనం పేర్కొంది.
రెండు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పార్టీలు దృష్టి పెట్టాయి.