ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణ ప్రవేశపెట్టే మార్గాలను పరిశీలించాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు.
ఐటీ శాఖ, ప్రైవేటు భాగస్వాముల సహకారంతో ఈ శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యక్రమాలు, నియామకాలు, ప్రాధాన్య పథకాల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు ఇచ్చారు.
1,000 కర్ణాటక పబ్లిక్ స్కూళ్ల (కేపీఎస్) అభివృద్ధికి నవంబర్ 14లోగా శంకుస్థాపనలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులను సమూహ సాగు వైపు ప్రోత్సహించి, శాస్త్రీయ ప్రాసెసింగ్, నిల్వపై మార్గదర్శనం చేయాలని, పూల సాగును ప్రోత్సహించి మార్కెటింగ్ కోసం కనీసం ఐదు ఎకరాల భూమిని గుర్తించాలని సూచించారు.
పశుసంవర్ధక శాఖ సమీక్షలో భాగంగా ప్రోటీన్ మిషన్ కింద చామరాజనగర, చిత్రదుర్గ, హావేరి, కొప్పళలో నాలుగు ప్రోటీన్ పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.