రాష్ట్రంలో అమలవుతున్న గ్యారంటీ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. నాయకత్వ మార్పు నేపథ్యంలో పథకాల అమలుపై వచ్చిన సందేహాలకు ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి వర్గం పేర్కొంది. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో పథకాలకు సంబంధించి మరిన్ని ప్రకటనలు ఉండే అవకాశం ఉంది.

సుస్థిర పాలన, అభివృద్ధి పథకాల కొనసాగింపుపై పార్టీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళానికి ఈ ప్రకటనతో తెరపడినట్లయింది.