వాషింగ్టన్, అక్టోబర్ 30 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఇరాన్ చర్చలు కొనసాగించాలనుకుంటోందని, అమెరికాకు ఇంకా సమయం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో అన్నారు.
చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ మాట్లాడాలనుకుంటోందని, యుద్ధం చాలా త్వరలోనే ముగుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన సైనిక ఎంపికలపై గురువారం ట్రంప్‌కు నేరుగా వివరించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ను ఉటంకిస్తూ వార్తా సంస్థలు తెలిపాయి. ఆ సమావేశంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారికి రాసిన లేఖ టెహ్రాన్‌కు అందిందని, దానికి ఇంకా స్పందించలేదని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నీమ్ గురువారం తెలిపింది. ఇరాన్–అమెరికా మధ్య పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వం విజయవంతమవుతుందని ఆ దేశ సైన్యం జాగ్రత్తతో కూడిన ఆశాభావం వ్యక్తం చేసింది.