వాషింగ్టన్, అక్టోబర్ 26 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఇరాన్ విషయంలో తాను త్వరలో నిర్ణయం తీసుకోనున్నానని, ఆ దేశంతో ఒప్పందం చేసుకోవాలా లేక దాన్ని అంతం చేయాలా అనేది తేల్చుకోవాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై ‘రెండు పూర్తిగా భిన్నమైన నిఘా నివేదికలు’ ఉన్నాయని కూడా ట్రంప్ విలేకరులతో అన్నారు. మరోవైపు అమెరికా చర్చలపై చిత్తశుద్ధితో లేదని ఇరాన్ ఆరోపించింది.
దక్షిణ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్ వద్ద అమెరికాకు చెందిన ‘లుకాస్’ డ్రోన్‌ను తమ వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించినట్లు అధికారిక అనుబంధ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది.
అమెరికా పౌరులపై దాడులకు ఇరాన్ అధునాతన దశలో పథకాలు రూపొందిస్తోందన్న నిఘా సమాచారం నేపథ్యంలో పశ్చిమాసియాలోని తమ ఉద్యోగులను అప్రమత్తం చేసినట్లు, రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో సిబ్బందిని తగ్గించినట్లు అమెరికా అధికారులు న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు.